- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP: గుడివాడ అమర్నాథ్ కు గుడ్లాభిషేకం చేసిన విద్యార్థులు.. కారణం ఇదే..
దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో తెలుగు విద్యార్థి విభాగం నిరసన చేపట్టింది. ఐటి శాఖా మంత్రి గుడివాడ అమర్నాథ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమర్నాథ్ పోస్టర్ పై కోడి గుడ్లు కొట్టారు. ఈ నేపథ్యంలో నిరసనకారులు మాట్లాడుతూ అమర్నాథ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో రాజకీయ ఓనమాలు నేర్చుకుని ఈ రోజు టీడీపీ అధినేత నారా చంద్రబబు పై, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా కోకేష్ పై ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదని..ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని..2024 లో నీ గుడ్డు మిగులుతుందని హెచ్చరించారు.
ఐటీ శాఖా మంత్రిగా ఉంది ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చావు అని ప్రశ్నించారు. 24 గంటల్లో ఐటీ శాఖా మంత్రిగా మీరు తీసుకొచ్చిన కంపెనీల దగ్గరకి వెళ్లి సెల్ఫీ దిగి వాట్సాప్ చేయగలరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ పైన ఇష్టానుసారంగా మాట్లాడాడితే ఉపేక్షించే పరిస్థితి లేదని మండిపడ్డారు. పేకాట లో జోకర్ లా వైసీపీ లో నువ్వో బ్రోకర్ అంటూ దుయ్యబట్టారు. ఇక గుడివాడ అమర్నాథ్ తాను ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్ లో కుండలో ఉడకబెట్టిన పప్పు తీసుకొచ్చి నారా లోకేష్ కు గిఫ్ట్ గా పంపిస్తున్న అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీనితో ఆగ్రహానికి లోనైన తెలుగు విద్యార్థి విభాగం అభ్యర్థులు తమ అభిమాన నాయకుడిని ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదంటూ ఆందోలనుకు దిగారు.
Read More..