Exams: ఏపీలో ఇంటర్ పరీక్షలు ఎప్పుడంటే..!

by srinivas |
Exams: ఏపీలో ఇంటర్ పరీక్షలు ఎప్పుడంటే..!
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఇంటర్ పరీక్షలు(Inter exams) నిర్వహించేందుకుపై విద్యాశాఖ అధికారులు(Education officials) కసరత్తులు చేస్తున్నారు. మార్చి 1 నుంచి పరీక్షలు నిర్వహించాలని ప్రాతిపాదించారు. మార్చి 1 నుంచి 20వ తారీకు వరకూ ఇంటర్ ఫస్ట్, సెకండియర్ పరీక్షలు నిర్వహించాలని అధికారులు ప్రతిపాదనలు చేశారు. అలాగే మానవ విలువలు-నైతికత పరీక్షలు ఫిబ్రవరి 1,3 తేదీల్లో, మార్చి 10 నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపారు. ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చిన వెంటనే ఇంటర్ పరీక్షలకు షెడ్యూల్ విడుదల చేయనున్నారు. విద్యార్థులు ఇప్పటి నుంచే పరీక్షలకు ప్రిపేర్ కావాలని ఇంటర్ అధికారులు సూచించారు. పరీక్షల్లో ప్రతిభ చూపి ఎక్కువ మార్కులు సాధించాలని పిలుపునిచ్చారు.

Next Story