- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పేదలకు అందుబాటులో విద్యా, వైద్యం: వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని
దిశ, అనకాపల్లి: రాష్ట్రంలో పేదలందరికీ కార్పొరేట్ విద్యా వైద్యాలు అందుబాటులో ఉండాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజిని తెలిపారు. మంగళవారం జీవీఎంసీ పరిధిలోని లంకెలపాలెంలో రూ. కోటి 22 లక్షల 97 వేలతో నిర్మించిన అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. నాడు నేడు పథకంలో రూ.399 కోట్లతో రాష్ట్రంలో 525 అర్బన్ పీహెచ్సీలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఈ కేంద్రంలో ఏడుగురు సిబ్బంది ఉంటారని, 38 వేల మందికి సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. చికిత్సకు 172 రకాల ఔషధాలు సరఫరా చేస్తారని, ఎక్స్పైరీ డేట్ అయినవాటి స్థానంలో వెంటనే కొత్త వాటితో భర్తీ చేయడం జరుగుతుందన్నారు. అందరికీ నాణ్యమైన, మెరుగైన వైద్యం ఉచితంగా అందుతుందన్నారు.
అనకాపల్లి ఎంపీ డాక్టర్ బి.వి.సత్యవతి మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యానికి ప్రాముఖ్యతనిస్తూ ముఖ్యమంత్రి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని, అందరి సంక్షేమానికి నవరత్నాల ద్వారా చేయూతనిస్తున్నట్లు చెప్పారు. పెందుర్తి శాసనసభ్యులు ఏ.అదీప్ రాజ్ మాట్లాడుతూ.. జీవీఎంసీ పరిధిలో లో పీహెచ్సీలు, యూపీహెచ్సీలు 30 ఉన్నాయని మరో 42 యూపీహెచ్సీల నిర్మించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి, జీవీఎంసీ కమిషనర్ సీ.ఎం. సాయి కాంత్ వర్మ, డిఎంఅండ్ హెచ్ఓ డాక్టర్ ఏ.హేమంత్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి:
వైఎస్ వివేకా హత్యపై డైవర్షన్ పాలిటిక్స్.. టీడీపీలోకి సునీతారెడ్డి..?