- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో కౌంటింగ్‌కు రెడీ.. తొలి అరగంటలోనే ఆ ఓట్ల ఫలితం
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మే 13న ఎన్నికల పోలింగ్ జరిగింది. జూన్ 4న ఫలితాలు విడుదలకానున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేస్తు్న్నారు. పోలింగ్ సమయంలో జరిగిన ఘటనల దృష్ట్యా ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్టభద్రత ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 375 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం సైతం అప్రమత్తమైంది. ఈవీఎం మెషిన్లు ఉంచిన స్ట్రాంగ్ రూములతో పాటు కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనా పరిశీలించారు. మచిలీపట్నంలోని కౌంటింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రాలకు కావాల్సిన ఫర్నీచర్, బారికేడింగ్, సెక్యూరిటీ, సీసీ టీవీ కెమెరాలు, స్టేషనరీ,కంప్యూటర్ కనెక్టివిటీ, హై స్పీడ్ ఇంటర్‌ను సిద్ధం చేసినట్లు తెలిపారు. మొదటి అరగంట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఉంటుందని సీఈవో ముకేశ్ కుమార్ మీనా స్పష్టం చేశారు.
కాగా ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేశాయి. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కౌంటింగ్‌కు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. దీంతో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే ఉత్కంఠ నెలకొంది. మళ్లీ అధికారం తమదేనని వైసీపీ చెబుతుండగా.. ఈ ఎన్నికల్లో అధికారం పీఠం దక్కుంచుకోబోతున్నామంటూ కూటమి నేతలు చెబుతున్నారు. మరి అధికారం ఎవరిని వరిస్తుందో చూడాలి.