BREAKING: నిరుదోగ్యులకు బిగ్ షాక్.. DSC పరీక్ష, టెట్ ఫలితాల విడుదలకు ఈసీ బ్రేక్

by Satheesh |   ( Updated:2024-03-30 14:03:22.0  )
BREAKING: నిరుదోగ్యులకు బిగ్ షాక్.. DSC పరీక్ష, టెట్ ఫలితాల విడుదలకు ఈసీ బ్రేక్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ ఏపీలో నిరుద్యోగులకు భారీ షాక్ తగిలింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఏపీ డీఎస్సీ పరీక్ష నిర్వహణను కేంద్ర ఎన్నికల కమిషన్ వాయిదా వేసింది. ఈ మేరకు ఈసీ శనివారం ఆదేశాలు జారీ చేసింది. డీఎస్పీ పరీక్షలతో పాటు.. ఇటీవల నిర్వహించిన ఏపీ టెట్ ఫలితాల విడుదలకు సైతం ఈసీ బ్రేక్ వేసింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసే వరకు టెట్ ఫలితాలు విడుదల చేయవద్దని ఈసీ అధికారులను ఆదేశించింది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో డీఎస్సీ పరీక్ష నిర్వహణ, టెట్ ఫలితాల విడుదల పోస్ట్ పోన్ అయ్యాయి.

ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత అధికారులు డీఎస్సీ నిర్వహణకు కొత్త పరీక్ష తేదీలను ప్రకటించనున్నట్లు సమాచారం. కాగా, 6100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం ఫిబ్రవరి 7న నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం మార్చి 30వ తేదీ నుండి పరీక్షలు జరగాల్సి ఉండగా.. ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో పరీక్షలు వాయిదా పడటంతో నిరుదోగ్యులు తీవ్ర నిరాశకు గురి అవుతున్నారు.

Read More..

మరి కాసేపట్లో ప్రచారం స్టార్ట్.. పవన్ కల్యాణ్‌కు బిగ్ షాక్ ఇచ్చిన అధికారులు..!

Advertisement

Next Story

Most Viewed