- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబు ఆరోగ్యంపై లోకేశ్ ఆందోళన.. ప్రభుత్వంపై నమ్మకంలేదని ఆవేదన
దిశ, వెబ్ డెస్క్: రాజమండ్రి జైల్లో చంద్రబాబుకు ప్రాణహాని ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. చంద్రబాబుతో ములాఖత్ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును ఇన్ని రోజులు జైలులో పెట్టినా ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారని మండిపడ్డారు. అసలు తమ కుటుంబానికి స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ప్రమేయమే లేదని తెలిపారు. టీడీపీ అధికారంలో ఉండగా చంద్రబాబు ఒక్కపైసా కూడా అవినీతికి పాల్పడలేదని చెప్పారు. చంద్రబాబు జైల్లోనే చచ్చిపోతారని వైసీపీ నేతలే చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన తల్లి నారా భువనేశ్వరిపై కూడా కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారని నారా లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అవినీతికి పాల్పడితే ప్రజలు ముందు పెట్టాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు. వ్యవస్థలను మేనేజ్ చేయడం వల్లే జగన్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందని విమర్శించారు. అవినీతి చేసి జైలుకు పోయివచ్చిన జగన్ మాత్రం బెయిల్ పై 10 ఏళ్లుగా బయట తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబును చంపుతామని మవోయిస్టులు లేఖ రాసినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు అనారోగ్య సమస్యలు ఉండటం వల్ల ఆయన 6 కిలోల బరువు తగ్గారని పేర్కొన్నారు. అధికారులు ఒకటి చెబుతుంటే.. వైద్యులు మరొకటి చెబుతున్నారని నారా లోకేశ్ వ్యాఖ్యానించారు.
Read More: అలా జరిగితేనే జగన్ పీడ పోతుంది: లోకేష్
‘దిశ కథనం’ ఎఫెక్ట్.. సీఎం జగన్, రాంగోపాల్ వర్మపై దారుణమైన ట్రోల్స్