- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tdp: నిన్ననే చంద్రబాబు ప్రకటన.. అప్పుడే నిరసన.. గో బ్యాక్ అంటూ నినాదాలు
దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా సామర్లకోటలో పెద్దాపురం ఎమ్మెల్యేకు చిన్నరాజప్పకు నిరసన సెగ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు విగ్రహావిష్కరణ సభ వేదిక నుంచి చినరాజప్పకు కిందకు దించాలని కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వచ్చే ఎన్నికల్లో పెద్దాపురం నుంచి చిన రాజప్ప పోటీ చేస్తారని చంద్రబాబు ప్రకటించారు. దీంతో అనంత చౌదరి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న రాజప్ప గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. చిన్నరాజప్పకు తాము మద్దతు ఇవ్వమని తేల్చి చెప్పారు.పార్టీ అధినేత చంద్రబాబు పెద్దాపురం అభ్యర్థిపై మరోసారి ఆలోచించాలని అంటున్నారు.
పెద్దాపురం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా చిన్న రాజప్ప
కాగా చిన్నరాజప్ప ఇప్పటికే పెద్దాపురం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ హయాంలో ఆయన హోంమంత్రిగా పని చేశారు. మూడోసారి చిన్నరాజప్పకు సీటు ఇవ్వరని ప్రచారం జరిగింది. దాంతో ఆ సీటు తమకే వస్తుందని ఆశావహులు నమ్మకం పెట్టుకున్నారు. అందులో భాగంగా ప్రయత్నాలు కూడా చేశారు. అయితే పార్టీ అధినేత చంద్రబాబు.. చిన్నరాజప్ప వచ్చే ఎన్నికల్లో పెద్దాపురం నుంచి మళ్లీ పోటీ చేస్తారని చెప్పడంతో వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.