పూల రైతులను నిరాశపర్చిన New Year

by srinivas |
పూల రైతులను నిరాశపర్చిన New Year
X

దిశ, రాజమండ్రి రూరల్: నూతన సంవత్సరం, సోమవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా పూల ధరలు ఆకాశాన్నంటి నాలుగు డబ్బులు కళ్ల చూద్దామనుకున్న పూల రైతులకు నిరాశ మిగిలింది. ఎప్పుడూ లేని విధంగా ధరలు తగ్గిపోయాయి. ప్రతి ఏటా ఈ రోజుల్లో అధిక ధరలు ఉండేవి. కానీ ఊహించని విధంగా తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక అంతరాష్ట్ర పూల మార్కెట్‌కు కొనుగోదారులు శుక్ర,శని వారాలలో రాలేదు. దీంతో స్థానికంగా పూల సాగు చేసే కడియం, ఆలమూరు ఆత్రేయపురం మండలాల రైతులే గాక కర్నూలు, నంద్యాల, చిత్తూరు తదితర జిల్లాల నుంచి పూలను తీసుకువచ్చిన రైతులు దిగాలు చెందారు. కేజీ రూ. 200పైబడి ఉండే చామంతి రకాన్ని బట్టి 40 నుంచి 100 రూపాయలు పలికింది. చాబంతి కూడా 30 నుంచి 50 రూపాయల మధ్య తచ్చాడింది. ఈ నూతన సంవత్సర వేడుకల కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులకు, పూల వ్యాపారులకు నిరాశ మిగిల్చింది. అసలే ఈ ఏడాది మూడుసార్లు వరదలు రావడం ఆ తర్వాత వర్షాలు వెంటాడంతో పూల రైతులు తీవ్రంగా నష్టపోయారు. నవంబర్ నెలలో రావలసిన పూల దిగుడులు డిసెంబరు చివర్లో రావడం అప్పటికే ముహూర్తాలు అయిపోవడంతో రైతులకు ఆశించిన ధర లేక తెచ్చిన అప్పులు తీరక తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed