- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Chandrababu Naidu : చంద్రబాబుతో నారా లోకేశ్ ములాఖత్.. ఆరోగ్యంపై ఆరా
దిశ, వెబ్ డెస్క్: చంద్రబాబు నాయుడుతో ఆయన కుటుంబ సభ్యులు ములాఖత్ అయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబును నారాలోకేశ్, భువనేశ్వరి, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కలిశారు. కాగా చంద్రబాబుకు జైల్లో స్కిల్ అలర్జీ అయింది. దీంతో రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. అయితే చంద్రబాబు ఆరోగ్యంపై మరోలా ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు 5 కిలో తగ్గారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు రాజమండ్రి జైలుకు వెళ్లి చంద్రబాబును కలవాలని అనుకున్నారు. ఈ మేరకు ములాఖత్ కోరారు. దీంతో జైలు అధికారులు అనుమతించారు. ప్రస్తుతం చంద్రబాబుతో కుటుంబ సభ్యులు ములాఖత్ కొనసాగుతోంది.ఇప్పటికే చంద్రబాబు ఆరోగ్యంపై నారా భువనేశ్వరి పలుమార్లు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ములాఖత్ము గిసిన తర్వాత చంద్రబాబు చంద్రబాబు ఆరోగ్యంపై నారా లోకేశ్, భువనేశ్వరి మీడియాతో మాట్లాడనున్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై స్పష్టత రానుంది.
కాగా స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. కోర్టు రిమాండ్ విధించడంతో ఆయన రాజమండ్రి జైలులో ఖైదీగా ఉంటున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయి 35 రోజులు అయింది. ఈ కేసులో ఇప్పటికీ వాదనలు కొనసాగుతోంది. సుప్రీంకోర్టుతో పాటు ఏసీబీ కోర్టులోనూ చంద్రబాబు తరపున లాయర్లు వాదనలు వినిపిస్తున్నారు. సీఐడీ తరపు లాయర్లు మాత్రం చంద్రబాబు బెయిల్ ఇవ్వొద్దని అంటున్నారు. ఈ కేసుకు సంబంధించి 19న సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.