Minister Karumuriకి ఎదురీత!.. దూసుకుపోతున్న రాధాకృష్ణ

by srinivas |   ( Updated:2023-02-04 14:15:38.0  )
Minister Karumuriకి ఎదురీత!.. దూసుకుపోతున్న రాధాకృష్ణ
X
  • 2024లో కూడా తిరేగే వారే కరువాయేనా?
  • బలమైన నేతగా టీడీపీ ఇంచార్జి రాధాకృష్ణ
  • నిత్యం జనంలో బిజీ బిజీ..

దిశ, ఉభయ గోదావరి ప్రతినిధి: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కాకినాడ జిల్లా తనుకు నియోజకవర్గంలో ఎదురీదుతున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తనకు అండగా ఉండి గెలిపించిన క్రియా శీలక నేతలు ప్రస్తుతం దూరం అయ్యారు. దీంతో వచ్చే ఎన్నికల్లో మంత్రి అష్ట కష్టాలు పడాల్సి వస్తుందని స్థానిక ప్రజలు, పలువురు రాజకీయ నేతలు అంటున్నారు. దీనికి తోడు స్థానిక టీడీపీ ఇంచార్జి ఆరమిల్లి రాధాకృష్ణ తన దైన శైలిలో జనంలోకి దూసుకుపోతున్నారు. తన కేడర్‌ను కాపాడుకుంటూనే కొత్త నాయకులను ఆయన ఆకర్షిస్తున్నారు. దిశ ప్రతినిధి నియోజకవర్గంలో పర్యటించి పలు వివరాలు సేకరించారు. ప్రజలు పలు అభిప్రాయాలు తెలియ చేశారు. మంత్రి హోదాలో ఉన్నా అభివృద్ధి చేయలేదని అంటున్నారు. టీడీపీ హయాంలోనే చాలా పనులు చేశారని చెబుతున్నారు. ప్రస్తుతానికి చాలా ప్రాంతాల్లో సాగునీటి సమస్య ఉన్నా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు.

మంత్రి నుంచి జారిపోతున్న క్రియాశీల కేడర్

మంత్రి కారుమూరికు గతంలో బలమైన కేడర్ వెంట ఉండేది. నియోజకవర్గం స్థాయిలో క్రీయా శీలకంగా ఉండే చాలా మంది మంత్రి ఏం చెబితే అది చేశావాళ్లు. వీళ్లే గత ఎన్నికల్లో మంత్రి గెలుపునకు విశేష కృషి చేశారు. అయితే ప్రస్తుతం కారుమూరి గెలిచిన తర్వాత వారిని పట్టించుకోవడం లేదనే ప్రచారం సాగుతోంది. దీంతో యోజకవర్గం వైసీపీ కేడర్‌లో కొంత నెగిటివ్ సాంకేతాలు వెళ్లాయి. ఓవైపు సీఎం జగన్ పథకాల పట్ల ఆదరణ ఉన్నా స్థానికంగా నాయకత్వం సరిగా లేకపోవడం వల్ల కేడర్ పెదవి విరుస్తోంది. పెద్ద నాయకులకే దిక్కు లేనప్పుడు కార్యకర్తలకు విలువ ఎక్కడ ఉంటుందని ఆవేదన చెందుతున్నారు. చేసేదేమీలేక స్థబ్దుగా ఉంటున్నారు. వైసీపీ వీరాభిమానులు సైతం స్థానికంగా పెదవి విరుపు మాటలు మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గెలుపు కోసం కసిగా పని చేయడం కష్టమేనని చెబుతున్నారు.

జనంలో బలమైన నేతగా టీడీపీ ఇంచార్జి ఆరమిల్లి రాధాకృష్ణ

మరోవైపు టీడీపీ ఇంచార్జి ఆరమిల్లి రాధాకృష్ణ జనంలో భారీగా ఆదరణ పొందుతున్నారు. సమస్యలపై ఇట్టే స్పందిస్తూ కార్యక్రమాలు చేపడుతున్నారు. 2014లో శాసన సభ్యుడిగా గెలిచిన రాధాకృష్ణ అప్పటి నుంచి అదే కేడర్‌న ప్రోత్సహిస్తూ వస్తున్నారు. దీంతో కార్యకర్తలతో బలమైన బంధం ఏర్పడిపోయింది. కార్యకర్తల ఇంటి శుభకార్యాలకు రాథాకృష్ణ ఇట్టే వాలిపోతున్నారు. అంతేగాక ఇదేం ఖర్మరాబాబూ మన రాష్ట్రానికి కార్యక్రమం దిగ్విజయంగా చేస్తున్నారు. ప్రతీ పల్లె తిరుగుతున్నారు. నియోజకవర్గంలో తణుకు టౌన్, తణుకు రూరల్, అత్తిలి, తోబాటు ఇరగవరంలో కొంత, ఉండ్రాజవరంలో కొంత ప్రాంతాలున్నాయి. గత ఎన్నికల్లో రాధాకృష్ణ కేవలం 2300 ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. ప్రస్తుతం ఆ సానుభూతి కూడా ప్రజల్లో నిండుగా ఉంది. పార్టీ అధినేత చంద్రబాబుతో మంచి సంబంధాలున్న రాధాకృష్ణ గెలిస్తే గతంలో మాదిరిగానే మంచి అభివృద్ధి చేస్తారని ఉండ్రాజవరం గ్రామస్తులు అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed