- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > ఆంధ్రప్రదేశ్ > తూర్పుగోదావరి > పోలవరం ఫైళ్ల దహనం బాధ్యులపై కఠిన చర్యలు: మంత్రి కందుల దుర్గేష్
పోలవరం ఫైళ్ల దహనం బాధ్యులపై కఠిన చర్యలు: మంత్రి కందుల దుర్గేష్

X
దిశ, డైనమిక్ బ్యూరో: పోలవరం ఫైళ్ళ దహనం ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ధవలేశ్వరంలో పోలవరం ప్రాజెక్టు కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. కాలిపోయినా ఫైళ్లను పరిశీలించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిరాక్స్ కాపీలు తగలబడినట్టు ఆర్డిఓ శివ జ్యోతి చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని బయటపడకుండా చేసేందుకు ఇటువంటి చర్యలకు ఒడిగట్టారని ప్రజలు ఆరోపిస్తున్నారని తెలిపారు. తగలబెట్టిన వారిని దాని ప్రోత్సహించిన వారిని వదిలిపెట్టబోమన్నారు. శాఖా పరమైన చర్యలు ఉంటాయని జేసీ చిన్న రాముడు తెలిపారు.
Next Story