Amalapuram: వివాహిత అనుమానాస్పద మృతి..

by srinivas |
Amalapuram: వివాహిత అనుమానాస్పద మృతి..
X

దిశ, అమలాపురం: ఇంటి నుండి బయటకు వెళ్లిన వివాహిత అనుమానాస్పదం‌గా మృతి చెందారు. ఆమె మృతదేహం పంట కాలువలో లభ్యమైంది. అమలాపురం మండలం బండారులంక కందులపాడు కాలనీకి చెందిన వివాహిత ఇంటి నుండి బయటకు వెళ్లారు. ఆమె ఎంతకీ రాకపోవడంతో కుటుంబ సభ్యులు సమీప బంధువుల ఇళ్ల వద్ద గాలించారు. అయినా ఆచూకీ లేకపోవడంతో భర్త పార్థసారథి అమలాపురం తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్థసారథి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అయితే అమలాపురం సమీపం ఇందుపల్లి వంతెన వద్ద బెండా కాలువలో ఆమె మృతదేహం ఉన్నట్లు సమాచారం అందింది. పోలీసులు అక్కడకు చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాన్ని పంచానామా నిర్వహించేందుకు అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Next Story