- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వరుపుల రాజా అందర్నీ కలుపుకుపోయే మంచి వ్యక్తి : Kannababu
దిశ,డైనమిక్ బ్యూరో: మాజీ డీసీసీబీ చైర్మన్, ప్రత్తిపాడు నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి వరుపుల రాజా మృతిపట్ల మాజీమంత్రి కురసాల కన్నబాబు విచారం వ్యక్తం చేశారు. కాకినాడ ఎంపీ వంగా గీత విశ్వనాథ్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్‌లతో కలిసి రాజా నివాసానికి వెళ్లారు. వరుపుల రాజా భౌతిక ఖాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. అనంతరం మాజీమంత్రి కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడారు. రాజా గుండెపోటుకు గురై మృతి చెందడం అత్యంత బాధకరమన్నారు. వరపుల రాజా మరణ వార్త తెలిసిన వెంటనే తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు వెల్లడించారు. వైసీపీలో రాజాతో కలిసి పనిచేసినట్లు చెప్పుకొచ్చారు. వరుపుల రాజా అందర్నీ కలుపుకుపోయే మంచి వ్యక్తి అని అలాంటి వ్యక్తిని కోల్పోవడం విచారకరమన్నారు. రాజా మరణం పట్ల సీఎం వైఎస్ జగన్ సైతం తీవ్ర విచారం వ్యక్తం చేశారన్నారు. వరుపుల రాజా అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారని మాజీమంత్రి కురసాల కన్నబాబు తెలిపారు.