- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Occult worship: కోనసీమలో క్షుద్రపూజలు కలకలం..
దిశ వెబ్ డెస్క్: మంత్రాలకు చింతకాయలు రాల్తాయా..? అంటే అవుననే అంటున్నారు కొందరు. పేరిగిన విజ్ఞానంతో మనిషి అంతరిక్షాన్ని సైతం అధిరోహిస్తున్నారు. అలాంటి ఈ కాలంలో అతీద్రియ శక్తులు ఉన్నాయని నమ్ముతూ.. నమ్మిస్తూ కొందరు క్షుద్రపూజలు చేస్తున్నారు. ఇలా క్షుద్రపూజల పేరుతో ప్రాణాలను సైతం తీసిన ఘటనలు గతంలో కోకొల్లలు. తాజాగా అలాంటి ఘటనే కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. తుని మండలంలోని లోవకొత్తూరు గ్రామంలో క్షుద్ర పూజల కలకలం రేపుతున్నాయి. సంచార జాతి వ్యక్తులు కొందరు గ్రామంలో పూజలు చేసి గేదె దూడని వధించారు. ఇది గమనించిన ఓ గ్రామస్తుడు వాళ్లను ప్రశ్నించారు.
దీనితో ఆగ్రహానికి లోనైన సంచార జాతి వ్యక్తులు ప్రశ్నించిన గ్రామస్తునిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశారు. దీనితో అప్రమత్తమైన గ్రామస్తులు వాళ్లను పట్టుకోవడానికి యత్నించగా.. ఒక్క వ్యక్తి మాత్రమే పట్టుబడ్డారు. కాగా మిగిలన వాళ్లు పరారయ్యారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.