Kakinada ఆయిల్ ఫ్యాక్టరీ బాధితులకు పరిహారం ప్రకటన

by srinivas |   ( Updated:2023-02-09 17:41:37.0  )
Kakinada ఆయిల్ ఫ్యాక్టరీ బాధితులకు పరిహారం ప్రకటన
X
  • రూ.50 లక్షలు నష్టపరిహారం ప్రకటించిన ప్రభుత్వం
  • ఆయిల్ ఫ్యాక్టరీ రూ.25 లక్షలు, ప్రభుత్వం తరఫున రూ.25లక్షలు
  • - రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత

దిశ, డైనమిక్ బ్యూరో: కాకినాడ అంబటి ఆయిల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు కార్మికులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద ఘటనపై రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత స్పందించారు. కాకినాడ దుర్ఘటన బాధితులకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించినట్లు వెల్లడించారు. పెద్దాపురం రంగంపేటలో ఆయిల్ ట్యాంకర్ క్లీన్ చేస్తూ ఊపిరాడక ఏడుగురు కార్మికులు మృతి చెందారని.. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల నష్టపరిహారం ఇస్తున్నట్లు హోం మినిస్టర్ తానేటి వనిత స్పష్టం చేశారు. అంబటి సుబ్బన్న ఆయిల్ ఫ్యాక్టరీ తరుపున రూ.25లక్షలు, ప్రభుత్వం తరపున మరో రూ.25 లక్షలు నష్టపరిహారం ఇస్తున్నట్లు హోంమంత్రి తెలిపారు. మృతుల కుటుంబాలకు హోంమంత్రి తానేటి వనిత ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున అండగా ఉంటామని హోంమంత్రి తానేటి వనిత హామీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి:

Pawan Kalyan: వారి కుటుంబాలను ఆదుకోండి..

Advertisement

Next Story