Breaking: శాంతి భద్రతలకు విఘాతం.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

by srinivas |   ( Updated:2024-03-01 11:50:23.0  )
Breaking: శాంతి భద్రతలకు విఘాతం.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్
X

దిశ, వెబ్ డెబ్క్: రాయవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల వాహనాలను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు.

కాగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అభివృద్ధిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి వైసీపీ ఎమ్మెల్యే సూర్య నారాయణ రెడ్డి సవాల్ విసిరారు. మార్చి 1న చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు. ఎమ్మెల్యే సవాల్‌ను స్వీకరించిన మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి రాయవరం నుంచి అనపర్తి వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు అడ్డుకున్నారు. అంతేకాదు నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు. అయితే టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా మోహరించారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయినా సరే పోలీసులు వెనక్కి తగ్గలేదు. రామకృష్ణారెడ్డి అదుపులోకి తీసుకు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. శాంతి భద్రతలకు రామకృష్ణారెడ్డి విఘాతం కలిగించినందు వల్లే అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. దీంతో పోలీస్ స్టేషన్ ఎదుట టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తమ నేతపై అక్రమంగా అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు ఎమ్మెల్యే సూర్యనారాయణ వర్గీయులు సైతం రాయవర్గం వెళ్లేందుకు యత్నించారు. రాయవరం దేవిచౌక్ వద్ద వారిని పోలీసులు అడ్డుకున్నారు. రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారని తెలియడంతో ఆందోళన విరమించారు. అయితే టీడీపీ, వైసీపీ కార్యకర్తలు, పోలీసుల తీరుతో రామవరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

Read More..

వారే వచ్చినా వెంట్రుక కూడా పీకలేరు.. కొడాలి నాని హాట్ కామెంట్స్

Advertisement

Next Story

Most Viewed