Breaking: పిఠాపురంలో ఉద్రిక్తత.. టీడీపీ మాజీ ఎమ్మెల్యేను అడ్డుకున్న జనసైనికులు

by srinivas |
Breaking: పిఠాపురంలో ఉద్రిక్తత.. టీడీపీ మాజీ ఎమ్మెల్యేను అడ్డుకున్న జనసైనికులు
X

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన, టీడీపీ మధ్య విభేదాలు బయటపడ్డాయి. టీడీపీ అధ్వర్యంలో ఉపాడలో జయహో బీసీల సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి జనసేన నేతలకు సమాచారం అందలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో జనసేన నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పొత్తులో భాగంగా తమను ఎందుకు పిలవలేదని మాజీ ఎమ్మెల్యే వర్మపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. అయితే ఇది టీడీపీ కార్యక్రమమని వర్మ చెప్పారు. దీంతో జనసేన నేతలు మరింతగా మండిపడ్డారు. ఒంటరిగా టీడీపీ ఒక్కటే జయహో బీసీల సమావేశం నిర్వహించడమేంటని ప్రశ్నించారు. వర్మ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తమ అధినేత పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.

కాగా టీడీపీతో పొత్తు సంబంధం లేకుండా పవన్ కల్యాణ్ శుక్రవారం రెండు సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. టీడీపీ కూడా రెండు చోట్ల అభ్యర్థులను ప్రకటించడంతో పవన్ కల్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే చాలా చోట్ల జనసేన, టీడీపీ అభ్యర్థులు ఒంటరిగా బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారు. దీనికి తోడు తాజాగా ఎవరికి వాళ్లు అభ్యర్థులను ఖరారు చేయడంతో టీడీపీ, జనసేన మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. అయితే జగన్‌ను ఓడించాలంటే ఇలాంటివి జరగకుండా ఇద్దరు అధినేతలు చేసుకోవాలని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఇప్పటికైనా అధినేతలు స్పందించి టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed