- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: మహిళలకు చంద్రబాబు వరాలు.. డైరెక్ట్‌గా అకౌంట్లోకి భారీగా డబ్బులు
దిశ, వెబ్ డెస్క్: మహానాడు వేదికగా మహిళలకు చంద్రబాబు శుభవార్త తెలిపారు. ‘మహాశక్తి’ పేరుతో నాలుగు పథకాలు ప్రకటించారు. ‘ఆడబిడ్డ‘ నిధి కింద నెలకు రూ.1500 ఖాతాల్లో వేస్తామని.. ఇంట్లో ఎంతమంది మహిళలున్నా అందరికీ డబ్బులు అందిస్తామన్నారు. 18 ఏళ్ల నుంచి 59 సంవత్సరాలున్న ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద రూ.1500 ఇస్తామని చెప్పారు. తల్లికి వందనం కింద ప్రతి ఏడాది రూ.15000 వేలు ఇస్తామన్నారు. స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు మహిళలకు అవకాశం ఇస్తామని చెప్పారు. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలిస్తామన్నారు. ఉద్యోగం వచ్చే వరకూ నిరుద్యోగులకు నెలకు రూ. 3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
నాలుగేళ్లుగా ఒక్క రైతును కూడా సీఎం జగన్ పరామర్శించలేదని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నిర్వహించిన టీడీపీ మహానాడులో చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై విమర్శలు చేశారు. సీఎం జగన్ అన్నదాతలను పట్టించుకోలేదని, కనీసం ధాన్యం కూడా కొనుగోళ్లు చేయలేదని తెలిపారు. తాను పోరాటం చేయడం వల్లే రాత్రి రాత్రికి ధాన్యం కొనుగోలు చేశారని చెప్పారు. ఈ ప్రభుత్వం రైతులు పూర్తిగా దగా చేసిందన్నారు.
‘జగన్ పని అయిపోయింది. జీవితంలో మళ్లీ ఎప్పుడూ గెలవడు. ఈ రాష్ట్రానికి తెలుగుదేశం అవసరం ఉంది. ఆస్తులు, ఆదాయం పెంచుకోవడంపైనే జగన్ ఆలోచన. బాబాయ్ హత్యలో అన్ని వేళ్లు జగన్ వైపు చూపుతున్నాయా లేదా..?. నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. హత్యలను ప్రోత్సహించే ముఖ్యమంత్రి అవసరమా..?.. జగన్ అలోచన డ్రగ్స్, గంజాయి, జే బ్రాండ్ మద్యం, ఇసుక మాఫియా. రోజుకు ఎంత వస్తుందనేదే జగన్ ఆలోచన. బానిసలకే టికెట్ ఇస్తారు. రౌడీలు, బూతులు మాట్లాడే వాళ్లని చట్ట సభలకు పంపుతారు. జగన్‌ది ధన బలం. ప్రిజన్ పాలిటిక్స్. వచ్చే ఎన్నికల్లో కురుక్షేత్ర యుద్ధమే. అందుకు ప్రతి టీడీపీ కార్యకర్త సిద్ధంగా ఉండాలి.’ అని చంద్రబాబు పిలుపు నిచ్చారు.