- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బ్యాంకు చోరీల నిందితుడు అరెస్ట్

దిశ, కాకినాడ : విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో బ్యాంకు చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి రెండు గన్లు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ బిందు మాధవ్ ఇవాళ విలేకరులకు తెలియజేశారు. కాజులూరులో దొంగతనం కేసులో నాగేశ్వరరావు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాగేశ్వరరావు గతంలో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ లో పనిచేస్తూ 900 గ్రాముల బంగారం అవకతవకలు చేయడంతో తొలగించారు.
బంగారానికి సంబంధించి రూ.40 లక్షలు బ్యాంకుకి కట్టాడని, ఆ మొత్తం సంపాదించాలనే ఉద్దేశంతో ఇప్పటివరకు ఏడు దొంగతనం చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. బ్యాంకులు, ఏటీఎంలు దగ్గర బెదిరించడానికి రెండు తుపాకులు, రెండు బుల్లెట్లను బీహార్ నుంచి తెచ్చుకున్నట్లు తెలిపారు. వాటిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అతనితోపాటు ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. సమావేశంలో డీఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్, సర్పవరం ఇన్ స్పెక్టర్ చైతన్య కృష్ణ పాల్గొన్నారు.