తారకరత్న మృతి టీడీపీకి తీరనిలోటు: Arimilli Radhakrishna

by srinivas |
తారకరత్న మృతి టీడీపీకి తీరనిలోటు: Arimilli Radhakrishna
X

దిశ, తణుకు: నందమూరి తారకరత్న మృతి పట్ల తణుకు టీడీపీ ఇంచార్జ్, మాజీ శాసనసభ్యుడు ఆరిమిల్లి రాధాకృష్ణ సంతాపం తెలిపారు. తారక రత్న ఒకే రోజు 9 సినిమాలను ప్రారంభించి ప్రపంచ స్థాయిలో ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారని ఆయన తెలిపారు. సినీ రంగంలో తారకరత్న ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారని కొనియాడారు. 20 సినిమాల్లో నటించి, అమరావతి సినిమాకు నంది అవార్డును అందుకుని ఒక మంచి నటుడిగా గుర్తింపు పొందారని తెలిపారు. తారకరత్న మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. కేవలం నటుడు గానే కాకుండా మంచి మనసున్న వ్యక్తి నందమూరి తారకరత్న అని అన్నారు. సమాజ సేవ చేయాలని రాజకీయాల్లోకి ప్రవేశించిన తరుణంలో దురదృష్టకరమైన సంఘటన జరగటం బాధాకరమని ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు.

Next Story