Skill Case: 2 వేల పేజీల్లో 600 అభియోగాలు.. చంద్రబాబును జడ్జి అడిగిన ప్రశ్నలు ఇవే..!

by srinivas |   ( Updated:2023-09-24 14:00:49.0  )
Skill Case: 2 వేల పేజీల్లో 600 అభియోగాలు.. చంద్రబాబును జడ్జి అడిగిన ప్రశ్నలు ఇవే..!
X

దిశ, వెబ్ డెస్క్: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడు జుడీషియల్ రిమాండ్‌ను ఏసీబీ జడ్జి పొడింగించారు. చంద్రబాబు కస్టడీ, తొలి రిమాండ్ ముగియడంతో రాజమండ్రి జైలు నుంచే చంద్రబాబును వర్చువల్‌గా జడ్జి విచారించారు. ఈ సందర్భంగా చంద్రబాబును జడ్జి పలు ప్రశ్నలు వేశారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించారా?, సీఐడీ అధికారులు బెదిరించారా..? అని చంద్రబాబును జడ్జి అడిగారు. ఇందుకు థర్డ్ డిగ్రీ లాంటిది ఏమీ లేదని, విచారణకు పూర్తిగా సహకరించానని జడ్జికి చంద్రబాబు తెలిపారు. తమపై 2 వేల పేజీల్లో 600 అభియోగాలున్నాయని చంద్రబాబుకు జడ్జి తెలిపారు. అభియోగ పత్రాలను చంద్రబాబు లాయర్లకు ఇవ్వాలని జడ్జి ఆదేశించారు. ఇక బెయిల్ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపడతామని జడ్జి తెలిపారు. మరోవైపు ఇన్నర్‌రింగ్ రోడ్డు, ఫ్రైబర్‌గ్రిడ్ విషయంలో జారీ చేసిన రెండు పీటీ వారంట్లపైనా సోమవారం విచారించే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed