Breaking: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్

by srinivas |
Breaking: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమగోదావరి జిల్లా(West Godavari District)లో రోడ్డు రక్తమోడింది. తాడేపల్లిగూడెం(Tadepalligudem) మండలం కుంచనపల్లి గ్రామం(Kunchanapalli village) వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. హైదరాబాద్(Hyderabad) నుంచి బోగెళ్ల వెంకట సత్య సురేశ్, ఆయన భార్య నవ్య, చిన్నారి వాసవి కృష్ణ కారులో మండపేట వెళ్తున్నారు. కుంచనపల్లి గ్రామం వద్దకు చేరుకోగానే వీరి కారును వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనకు అతివేగమే కారణమని స్థానికుల నుంచి తెలుసుకున్నారు. కారు నెంబర్ ఆధారంగా మృతులను గుర్తించారు. ముగ్గురు మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఈ ప్రమాదంతో రోడ్డుపై రోడ్డుపై భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed