- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP DSC 2024:జూలై 1న మెగా డీఎస్సీ షెడ్యూల్ విడుదల..జిల్లాల వారీగా ఖాళీలు ఇవే!
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో టీడీపీ కూటమి నూతన ప్రభుత్వం ఏర్పాటైంది. ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల పై ప్రత్యేక దృష్టి పెట్టారు. రాష్ట్రాభివృద్ది దిశగా నూతన ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో టీడీపీ ప్రభుత్వం ప్రజలకు వరుసపెట్టి గుడ్‌న్యూస్ చెబుతోంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు మొదటి సంతకం మెగా డీఎస్సీ ఫైల్ పై చేశారు. దీంతో నిరుద్యోగుల్లో ఆశలు మళ్లీ చిగురించాయి. నిన్న (సోమవారం) జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో మెగా డీఎస్సీకి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
జిల్లాల వారీగా పోస్టులు..
మెగా డీఎస్సీలో మొత్తం 16,347 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీని పూర్తి చేసేలా షెడ్యూల్ రెడీ చేయాలని నిర్ణయం తీసుకుంది. 16,347 DSC పోస్టులకు జూలై 1వ తేదీన షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో జిల్లాల వారిగా ఖాళీలను ప్రకటించింది. జిల్లా, మండల పరిషత్, మున్సిపల్ స్కూళ్లో 14,066 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. శ్రీకాకుళంలో 543, విజయనగరంలో 583, విశాఖ 1134, తూర్పు గోదావరి 1346, పశ్చిమ గోదావరి 1067, కృష్ణా 1213, గుంటూరు 1159, ప్రకాశం 672, నెల్లూరు 673, చిత్తూరు 1478, కడప 709, అనంతపురం 811, కర్నూలు 2678 ఖాళీలు ఉన్నాయి ఇక రెసిడెన్షియల్, మోడల్ స్కూళ్లు, బీసీ, గిరిజన స్కూళ్లో 2,281 పోస్టులు భర్తీ కానున్నాయి. కాగా, జూలై 1వ తేదీ నుంచి డీఎస్సీ ప్రక్రియ షురూ చేసి డిసెంబర్ 10లోగా పరీక్షలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.