- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అపోహలను నమ్మొద్దు: మంత్రి నాదెండ్ల
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల(Free gas cylinders)ను ఇస్తామని కూటమి ప్రభుత్వం(A coalition government) ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. ఇందులో భాగంగా ఈ నెల 29 నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల ఆన్ లైన్ బుకింగ్స్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. అలాగే రేపటి నుంచి అర్హులకు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించనున్నారు. ఈ క్రమంలో ఈ పధకానికి ఖర్చయ్యే నిధులను సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) కలిసి పెట్రోలియం సంస్థలకు అందజేశారు. హిందుస్థాన్ పెట్రోలియం (Hindustan Petroleum), భారత్ పెట్రోలియం కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థల ప్రతినిధులకు సచివాలయంలో (AP Secretariat)లో మొదటి ఉచిత సిలిండర్లకు అయ్యే రూ.894 కోట్ల చెక్కును అందజేశారు.
అనంతరం పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై అపోహలను నమ్మొద్దని సూచించారు. అలాగే రాష్ట్రంలోని అర్హులైన అందరూ.. తప్పకుండా కేవైసీ చేయించుకోవాలన్నారు. ఈ పథకంలో భాగంగా ఒక్కరోజులోనే 4.5 లక్షల బుకింగ్స్ వచ్చినట్లు తెలిపారు. అలాగే సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను ఇచ్చే ఈ పధకానికి ఐదేళ్ళకు రూ.13 వేల కోట్లు ఖర్చు అవుతుందని ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) చెప్పుకొచ్చారు.