- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నాకు కష్టం వచ్చింది.. పవన్ కల్యాణ్ అండగా నిలబడాలి: దివ్వెల మాధురి
దిశ, వెబ్ డెస్క్: దువ్వాడ వాణిని అరెస్ట్ చేయాలని దివ్వెల మాధురి డిమాండ్ చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇల్లీగల్‌గా దివ్వెల మాధురితో ఉంటున్నారని ఆయన భార్య ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ వివాదం ముదిరి పాకానపడింది. దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద ధర్నా చేస్తున్న వాణి, దివ్వెల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. దువ్వాడ వాణి చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని, తాను కూడా దువ్వాడ శ్రీనివాస్ వద్ద ఇంటి వద్ద ధర్నా చేస్తానని మాధురి తెలిపారు. ఈ మేరకు ఆయన ఇంటి వద్ద ధర్నా చేసేందుకు వెళ్తున్న సమయంలో మాధురి కారు.. మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలతో గాయపడిన మాధురికి ఆస్పత్రిలో చికిత్స అందించారు. అయితే మెరుగైన వైద్యం తీసుకునేందుకు మరో ఆస్పత్రిలో చికిత్స తీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
ఈ క్రమంలో దివ్వెల మాధురి మాట్లాడుతూ తనకు కష్టం వచ్చిందని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అండగా నిలవాలని కోరారు. ‘‘వాణి చేసిన ఆరోపణలపై నా పిల్లలను స్కూల్లో, ట్యూషన్‌లో అందరూ అడుతున్నారట. ఆ విషయం నాకు ఫోన్ చేసి చెప్పారు. నాకు చాలా బాధ అనిపించింది. ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నా. లారీని ఢీకొట్టాలని చూశా. మిస్సయి కారును ఢీకొట్టా. తలలో బ్లడ్ క్లాట్ అయిందని వైద్యులు చెప్పారు. సిటీ స్కాన్ చేయించమన్నారు. ఆస్పత్రిలో పోలీసులు ఫస్ట్ బాగానే రెస్పాండ్ అయ్యారు. నా వాంగ్మూలాన్ని తీసుకున్నారు. నా పిల్లలకు అవమానం జరిగింది. అందుకే ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నా. వాణిపై యాక్షన్ తీసుకోండి అని పోలీసులను అడిగా. చర్యలు తీసుకుంటామని, చికిత్స తీసుకోవాలని నాకు సూచించారు. ఏం జరిగిందో ఏమో తెలియదు గాని పోలీసులు నా పట్ల ర్యాష్‌గా ప్రవర్తించారు. మీడియాను కూడా అనుమతించలేదు. నేను తాగి ఉన్నానని అన్నారు. బ్రీత్ ఎనలైజర్ చేయాలని చెప్పా. చేస్తే జీరో వచ్చింది. డీఎస్పీ ఆదేశాలతో బలవంతంగా బ్లడ్ టెస్ట్ చేస్తామన్నారు. నేను ఒప్పుకోలేదు. మీడియాను చెబుతానని చెప్పడంతో వెనక్కి తగ్గారు. నా పిల్లలపై వాణి చేసిన వ్యాఖ్యలపై పోలీసులు యాక్షన్ తీసుకోవాలి. ఆడపిల్లలకు కష్టం వస్తే అండగా ఉంటానన్న పవన్ కల్యాణ్ స్పందించాలి. నాకు కష్టం వచ్చింది. పవన్ అండగా నిలవాలి.’’ అని మాధురి కోరారు.