AP:సాగునీటి సంఘాల ఎన్నికలకు సర్వం సిద్ధం:జిల్లా కలెక్టర్

by Jakkula Mamatha |   ( Updated:2024-12-13 15:24:49.0  )
AP:సాగునీటి సంఘాల ఎన్నికలకు సర్వం సిద్ధం:జిల్లా కలెక్టర్
X

దిశ, పాడేరు: జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికలకు సర్వం సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ ఎస్ దినేష్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. జిల్లాలోని 16 మండలాలలో పాడేరు డివిజన్ పరిధిలోని అనంతగిరి, అరుకువ్యాలీ, డుంబ్రిగుడ, హుకుంపేట, పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, జి.కె. వీధి, కొయ్యూరు, రంపచోడవరం డివిజన్ పరిధిలో రంపచోడవరం, దేవీపట్నం, గంగవరం, రాజవొమ్మంగి, వై.రామవరం, మారేడిమిల్లి, అడ్డతీగల మండలాల్లో ఉన్న 84 నీటి వినియోగదారుల సంఘాలకు అసాధారణ సర్వసభ్య మండలి సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పారు.

ఈ మేరకు జిల్లా నిర్దేంచిన గ్రామాలలో నిర్వహిస్తున్న సమావేశ వేదిక వద్దకు ఉదయం 8.00 గంటలకు చేరుకోవాలని తెలియజేసారు. ముందుగా ప్రాదేశిక నియోజకవర్గం సభ్యులను ఎన్నుకుంటారని పేర్కొన్నారు. అనంతరం మధ్యాహ్నం 3.00 గంటల నుండి 5.00 వరకు నీటి సంఘాల అధ్యక్షులను ఉపాధ్యాక్షులను ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. నీటి సంఘం ఓటు హక్కు కలిగిన భూ యజమానులు అసాధారణ సర్వ పరిధిలో సభ్య సమావేశం లో పాల్గొనాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed