Deputy CM Pawan:పవన్ కళ్యాణ్ నిర్ణయం పై బిహార్‌లో చర్చ

by Jakkula Mamatha |
Deputy CM Pawan:పవన్ కళ్యాణ్ నిర్ణయం పై బిహార్‌లో చర్చ
X

దిశ,వెబ్‌డెస్క్: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నిన్న(శనివారం) సనాతన ధర్మాన్ని(Sanatana Dharma) పరిరక్షించేందుకు 'నరసింహ వారాహి బ్రిగేడ్' వింగ్‌ను పార్టీలో కొత్త విభాగాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల రాష్ట్రంలో సనాతన ధర్మం పై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే సనాతన ధర్మం(Sanatana Dharma) అనే అంశం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా సెన్సేషన్ అవుతోంది. ఈ క్రమంలో తాజాగా సనాతన ధర్మ పరిరక్షణకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనను బీహార్ బీజేపీ నేతలు స్వాగతించారు. బిహార్‌లో కూడా ఈ తరహా వింగ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి నీరజ్ బాబు పేర్కొన్నారు. అయితే ఇది క్షేత్రస్థాయి పరిస్థితుల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి చేస్తున్న ప్రయత్నాలని, వీరందరూ నకిలీ సనాతనీయులని ఆర్‌జేడీ నేత(RJD leader) మృత్యుంజయ్ తివారీ(Mrityunjay Tiwari) విమర్శించారు.

Advertisement

Next Story