పవన్ కల్యాణ్ పై ఆర్జీవీ సెటైర్లు.. పవన్ మరీ ఇలా అయ్యాడేంటీ అంటూ కామెంట్స్

by Javid Pasha |
పవన్ కల్యాణ్ పై ఆర్జీవీ సెటైర్లు.. పవన్ మరీ ఇలా అయ్యాడేంటీ అంటూ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన కార్యకర్తను కాళహస్తి సీఐ అంజూ యాదవ్ కొట్టిన విషయాన్ని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సీరియస్ గా తీసుకున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ఆయన సీఐ అంజూ యాదవ్ పై తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. కాగా దీనిపై డైరెక్టర్ ఆర్జీవీ స్పందించారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ తిరుపతి ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన వీడియోను తన ట్విట్టర్ లో పోస్టు చేశారు. చంపేస్తా, నరికేస్తా, చర్మం వలిచేస్తా అంటూ సింహంలా గాండ్రించే పవన్ కల్యాణ్.. ఎస్పీ ముందు చేతులు కట్టుకొని ఎస్పీగారూ అంటూ మాట్లాడారని అన్నారు. దీన్ని బట్టి చూస్తే పవన్ కల్యాణ్ హీరో నుంచి జీరో అయినట్టుందని, ఈ ఘటనతో పవన్ అభిమానిగా తాను చాలా హర్ట్ అయ్యానని సెటైర్లు వేశారు.

Next Story