- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేవినేని ఉమా, నక్కా ఆనందబాబు, ఆళ్లపాటి రాజాల హౌస్ అరెస్ట్
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో ఇసుక అక్రమాలపై తెలుగుదేశం పార్టీ పోరాటానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా మూడో రోజులుగా టీడీపీ నేతలు ఇసుక అక్రమ మైనింగ్‌పై పోరాటం చేస్తున్నారు. అయితే మూడో రోజు అయిన బుధవారం ఇబ్రహీంపట్నంలో ఉన్న డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడికి టీడీపీ పిలుపునిచ్చింది. అయితే ముట్టడికి పోలీసులు అనుమతి నిరాకరించారు. అంతేకాదు గుంటూరు, కృష్ణా జిల్లాలలోని టీడీపీ ముఖ్యనేతలను గృహనిర్బంధం చేశారు. బయటకు వస్తే అరెస్ట్ చేస్తామంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మాజీ మంత్రులు నక్కా ఆనంద బాబు, ఆలపాటి రాజా , టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాస ఇళ్లకు పోలీసులు చేరుకున్నారు.నోటీసులు ఇవ్వడంతోపాటు భారీగా వారి ఇళ్లవద్ద మోహరించారు. మరోవైపు మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మంగళవారం అర్ధరాత్రి నుండి గొల్లపూడి ఇంటి వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. అయితే పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించిన మైనింగ్ ఆఫీస్ కు వెళ్లి ఇసుక అక్రమాల పై ఆధారాలు ఇస్తామని టీడీపీ శ్రేణులు చెప్తున్నారు.