- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌పై డిప్యూటీ సీఎం పవన్ రివ్యూ.. మైండ్ బ్లాంక్ అయ్యేలా ప్రశ్నలు
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం ఆయన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌పై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఉన్నతాధికారులతో పాటు ఇంజనీర్లు కూడా హాజరయ్యారు. కార్పొరేషన్ తీరుతెన్నులపై డిప్యూటీ సీఎంకు అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం పవన్ మాట్లాడుతూ.. గతన ఐదేళ్ల వైసీపీ పాలనలో కేంద్రం రాష్ట్రానికి మంజూరు చేసిన రూ.1,066 కోట్లు దేనిక ఖర్చు చేశారని అధికారులను మైండ్ బ్లాంక్ అయ్యేలా ప్రశ్నించారు. ప్రతి దానికి లెక్కలు చెప్పాలని ఆదేశాలు జారీ చేశారు.
అదేవిధంగా స్వచ్ఛాంధ్రకు కేంద్రం నుంచి వచ్చిన నిధులు, ఖర్చుల వివరాలపై ఆరా తీశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు వచ్చినప్పటికీ ఆ నాటి రాష్ట్ర ఆర్థిక శాఖ స్వచ్ఛాంధ్రకు విడుదల చేయలేదంటూ అధికారులు పవన్ కల్యాణ్‌కు తెలిపారు. ప్రస్తుతం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఖాతాలో కేవలం రూ.7 కోట్లు మాత్రమే మిగిలాయని, అవి ఐదు నెలల జీతాలకు మాత్రమే సరిపోతాయని పవన్ అన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.2,092 కోట్ల నిధులుంటే ఇప్పుడు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందన్న అధికారులను ప్రశ్నించారు. నిధుల మళ్లింపుపై వివరణ ఇవ్వాలని అధికారులను పవన్ ఆదేశించారు.