- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Pawan Kalyan:వాలంటీర్ల పై డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: గత ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ(Volunteer system)పై రాష్ట్రంలో చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో వాలంటీర్ల(volunteers)ను కొనసాగిస్తారా లేదా అనే ప్రశ్నలు తలెత్తాయి. ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పిందని.. మధ్యలో వాలంటీర్ల(volunteers)ను ప్రభుత్వం పక్కన పెట్టిందని ప్రతిపక్ష వైసీపీ నేతలు పేర్కొంటున్నారు.
ఈ క్రమంలో తాజాగా వాలంటీర్ వ్యవస్థ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు(గురువారం) సర్పంచ్ సంఘాలతో ఆయన అమరావతిలో భేటీ అయ్యారు. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలన్న సర్పంచ్‌ల విజ్ఞప్తి పై డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘వాలంటీర్ల(volunteers)కు మేలు చేయాలనే ఆలోచనలతో ప్రభుత్వం ఉంది. కానీ గత ప్రభుత్వం వారిని మోసం చేసింది. వాళ్లు ఉద్యోగంలో ఉంటే రద్దు చేయవచ్చు. కానీ వాళ్లు అసలు వ్యవస్థలోనే లేదు. ఇదో సాంకేతిక సమస్య ’అని ఆయన మాట్లాడారు.