- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Ys Jagan: ఇంత దారుణమా.. మేమెప్పుడూ చూడలేదు?
దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు(Cm Chandrababu) పాలనపై మాజీ సీఎం వైఎస్ జగన్(Former Cm Ys Jagan) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy Cm Pawan Kalyan), హోంమంత్రి వంగలపూడి అనిత(Home Minister Vangalapudi Anitha)తో పాటు పలువురు మహిళలతను కించరుస్తూ పోస్టులు పెడుతున్న వైసీపీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ల (YCP Social Media Coordinators)అరెస్ట్‌ను ఆయన ఖండించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో చీకటి రోజులు నడుస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ఇలాంటి దారుణాతిదారుణ పరిస్థితులను ఎప్పుడూ చూడలేదని జగన్ మండిపడ్డారు.
రాష్ట్రంలో ప్రజా స్వామ్యం ఖూనీ అయిందని జగన్ విమర్శించారు. ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపుతప్పాయని, అన్ని వ్యవస్థలను నీరుగార్చారని జగన్ ఆరోపించారు. ‘‘5 నెలల్లో 91 మంది మహిళలపై అత్యాచారం జరిగింది. విద్యావ్యవస్థలో మేము తీసుకొచ్చిన సంస్కరణలను నిర్వీర్యం చేశారు. విద్యారంగాన్ని పూర్తిగా నాశనం చేశారు. ఆర్బీకేలు నిర్వీర్యమైపోయాయి. ఈ-క్రాప్ లేదు, ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది. ఇప్పుడు డోర్ డెలివరీ ఊసే లేకుండా పోయింది. టీటీడీ కార్యకర్తలు చెప్పిన వాళ్లకే పథకాలు ఇస్తున్నారు. ఇప్పటికే లక్షన్నర పింఛన్లు కట్ చేశారు.’’ అని జగన్ వ్యాఖ్యానించారు.