- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
HYDRA : బెంగళూరులో హైడ్రా బృందం.. కర్ణాటక డిజాస్టర్ మానిటరింగ్ సెంటర్ సందర్శన
దిశ, డైనమిక్ బ్యూరో: బెంగళూరులో హైడ్రా (HYDRA) అధికారుల బృందం పర్యటన చేస్తోంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ (Karnataka State Natural Disaster Monitoring Centre) కర్ణాటక స్టేట్ నేచురల్ డిజాస్టర్ మానిటరింగ్ సెంటర్‌ను హైడ్రా బృందం సందర్శించింది. చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ, ప్రకృతి వైపరీత్యాల నిర్వహణపై హైడ్రా బృందం అధ్యయనం చేస్తుంది. కాగా, బెంగళూరులో చెరువులు పునరుజ్జీవనంపై క్షేత్రస్థాయిలో స్థితిగతులను అధ్యయనం చేయడం, మురుగునీరు స్వచ్ఛంగా మార్చడం, డిజాస్టర్ మేనేజ్మెంట్‌లో అనుసరించిన విధానాలను పరిశీలించేందుకు కమిషనర్ రంగనాథ్ (Commissioner Ranganath) సారథ్యంలోని హైడ్రా బృందం రెండు రోజుల పాటు బెంగళూరు పర్యటనలో ఉన్నారు.
అక్కడి చెరువులను అధ్యయనం చేసి Hyderabad హైదరాబాద్ మహానగర పరిధిలో ఉన్న బాచుపల్లిలోని ఎర్రగుంట చెరువు, మాదాపూర్ లోని సున్నంచెరువు, కూకట్‌పల్లిలోని నల్లచెరువు, రాజేంద్రనగర్ లోని అప్పచెరువులకు పునరుజ్జీవం కల్పించనున్నారు. దీంతో పాటు భారీ వర్షాలు కురిసినప్పుడల్లా హైదరాబాద్ మహా నగరాన్ని వరద నీరు ముంచెత్తడం, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు బెంగళూరు డిజాస్టర్ మేనేజ్మెంట్ నిపుణులతో హైడ్రా అధికారులు సమావేశం కానున్నట్లు తెలిసింది.