Pawan Kalyan:‘సనాతన ధర్మం’ పై డిప్యూటీ సీఎం పవన్ సంచలన ప్రకటన

by Jakkula Mamatha |   ( Updated:2024-11-03 09:11:38.0  )
Pawan Kalyan:‘సనాతన ధర్మం’ పై డిప్యూటీ సీఎం పవన్ సంచలన ప్రకటన
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో కూటమి ప్రభుత్వం(AP Government) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్(Deputy CM Pawan) పేర్కొన్నారు. ఈ క్రమంలో దీపం-2 పథకంలో భాగంగా ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు(Three free cylinders) అందిస్తామని తెలిపారు. ప్రతి ఏడాది 1,08,39,286 మంది ఈ పథకం కింద లబ్ధి పొందుతారని వివరించారు. ఇందుకోసం ఏడాదికి రూ. 2,684 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. మహిళలపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. నిన్న (శనివారం) ఏలూరులోని జగన్నాథపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ‘దీపం-2’ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మాట్లాడుతూ.. ‘సనాతన ధర్మం’ (Sanatana Dharma)పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు జనసేనలో ‘నరసింహ వారాహి బ్రిగేడ్’(Narasimha Varahi Brigade) వింగ్‌ను ప్రారంభిస్తున్నట్టు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ క్రమంలో తాను అన్ని మతాలను గౌరవిస్తానని, కానీ తన విశ్వాసాలపై నిలబడతానని పవన్ పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారు, సనాతన ధర్మాన్ని(Sanatana Dharma) అగౌరవపరిచే వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed