- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pawan Kalyan:సినిమాల పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో కృష్ణా జిల్లా కంకిపాడులో ‘పల్లె పండుగ’ కార్యక్రమాన్ని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు(సోమవారం) ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలు బాగుండాలని, యువతకు ఉద్యోగాలు రావాలని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డామని డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ అభిమానులు 'ఓజీ' అంటూ నినాదాలతో హోరెత్తించారు. దీంతో పవన్ కళ్యాణ్ సినిమాల గురించి మాట్లాడారు.
ఈ క్రమంలో ‘ముందు బాధ్యత, ఆ తర్వాత వినోదం’ అని ఆయన వ్యాఖ్యానించారు. ముందు యువతకు ఉపాధి కల్పించాలని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని అన్నారు. ఆ తర్వాతే విందులు, వినోదాలు అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సినిమాల్లో తాను ఎవరితో పోటీ పడనని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఒక్కో స్థాయిలో నిష్ణాతులేనని పవన్ కళ్యాణ్ తెలిపారు. బాలకృష్ణ, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, నాని ఇలా అందరూ బాగుండాలని కోరుకునేవాడినని చెప్పారు. అంతేకాదు సీఎం చంద్రబాబుపై కూడా పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. పాలన ఎలా చేయాలనే అంశంలో తనకు సీఎం చంద్రబాబు స్ఫూర్తి అని డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు.