- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pawan Kalyan: కీరవాణికి స్పెషల్ థాంక్స్ చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కారణమేంటంటే?
దిశ, సినిమా: గత కొద్ది రోజుల నుంచి దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూ వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సనాతన ధర్మం పాటిస్తున్నానని పలు కామెంట్స్ చేసి ముందుండి ప్రభుత్వం తరపున మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో.. ఆయన కోసం ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి పవన్ కోసం ఓ చిన్న ఆడియోని రెడీ చేశారు. ఇక ఈ విషయం పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించి స్పెషల్ థాంక్స్ చెప్పారు. ‘‘ఓం నమో నారాయణాయ’ మంత్రాన్ని ప్రజానీకం పఠించేందుకు అనువుగా ఆడియో రికార్డు రూపొందించిన ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ ఎం. ఎం. కీరవాణి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
తిరుమల మహా ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం భక్తి భావం కలిగిన ప్రతి ఒక్కరికి తీవ్ర ఆవేదన కలిగించింది. ఈ ఆవేదన నుంచి ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించాను. ఈ దీక్షకు సంఘీభావంగా జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులతో పాటు ధార్మిక విశ్వాసాలు కలిగిన వారందరూ ఆలయాల్లో పూజలు, హోమాలు, భజనలు చేస్తున్నారు. వారంతా ఓం నమో నారాయణాయ మంత్రం పఠిస్తున్నారు. అందుకు అనువుగా శ్రీ కీరవాణి గారు ఆడియో రికార్డు చేశారు. అది భక్తి భావంతో సాగింది. ఇందులో భాగం పంచుకున్న సంగీత కళాకారులకి, సాంకేతిక నిపుణులకి ధన్యవాదాలు. ధర్మో రక్షతి రక్షితః’’ అని ఓ లేఖను షేర్ చేశారు.