లంచం అనే పదం వినిపించొద్దు: పవన్ సంచలన ఆదేశాలు

by srinivas |   ( Updated:2024-10-19 14:33:33.0  )
లంచం అనే పదం వినిపించొద్దు: పవన్ సంచలన ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: లంచం అనే పదం వినిపించొద్దని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) ఆదేశించారు. వైసీపీ నుంచి పలువురు కీలక నేతలు జనసేన(Janasena)లో చేరారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ తన శాఖపై కీలక వ్యా్క్యలు చేశారు. పంచాయతీ రాజ్ శాఖ(Panchayat Raj Department)లో పారదర్శకత పాటించాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని అధికారులను ఆయన హెచ్చరించారు. పంచాయతీ రాజ్ వ్యవస్థలో లంచాలు, రికమండేషన్స్ లేకుండా బదిలీలు చేశామని చెప్పారు. లంచం అనే పదం వినిపిస్తే వెంటనే ఆఫీసు నుంచి వెళ్లిపోతారని అధికారులకు తాను చెప్పినట్లు తెలిపారు. లంచాలు తీసుకునే వ్యక్తులు, అధికారులు పంచాయతీ రాజ్ శాఖకు అవసరంలేదని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

Read More : చేరికలపై కీలక వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్

Advertisement

Next Story

Most Viewed