శాంతి భద్రతలపై పవన్ కీలక విజ్ఞప్తి.. సానుకూలంగా స్పందించిన చంద్రబాబు

by srinivas |   ( Updated:2024-07-25 12:24:13.0  )
శాంతి భద్రతలపై పవన్ కీలక విజ్ఞప్తి.. సానుకూలంగా స్పందించిన చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలోని శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని శాంతి భద్రతలపై విస్తృతంగా చర్చలు జరగాలని, ఈ ఒక్క రోజుతో ముగించొద్దని పవన్ కల్యాణ్ సూచించారు. అవరమైతే రెండు సెషన్స్ జరపాలని కోరారు. ‘‘ఐదు కోట్ల మందికి భద్రత కల్పించాలి. శాంతి భద్రత విషయంలో ఏపీ దేశంలో తలమానికంగా ఉండాలి. చట్టం అంటే భయం వచ్చేలా ఉండాలి. ఎమ్మెల్యేల అభిప్రాయాలు స్వీకరించాలి. పార్టీ పరంగా అక్రమ కేసులపై చర్చించాం. కానీ రాష్ట్రంలోని శాంతి భద్రతలపై మరింత చర్చ జరగాలి.‘‘ అని చంద్రబాబును పవన్ కల్యాణ్ కోరారు.

అయితే పవన్ కల్యాణ్ సూచనపై సీఎం చంద్రబాబు సానుకూలంగా చర్చించారు. పవన్ కల్యాణ్ అభిప్రాయంతో ఆయన ఏకీ భవించారు. పవన్ కల్యాణ్ చెప్పినట్లు శాంతి భద్రతలపై అందరిలో అవగాహన రావాలన్నారు. ‘‘శాంతి భద్రతలపై లోతైన చర్చ జరగాలి. ప్రజల్లో చైతన్యం రావడం చాలా అవసరం. గత ప్రభుత్వం హయాంలో శాంతి భద్రతలు క్షీణించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి భద్రతలను పటిష్టం చేయాలి. అధికార యంత్రాంగం చాలా వరకు నిర్వీర్యం అయింది. ఈ వ్యవస్థను సైతం పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. వచ్చే సమావేశాల్లో శాంతి భద్రతలపై మరింతగా చర్చింద్దాం. లా అండ్ ఆర్డర్‌లో ఏపీ నెంబర్ వన్‌గా ఉండేలా చేద్దాం.’’ అని చంద్రబాబు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed