ప్రభుత్వ పథకాల పేర్లలో మార్పులు.. సీఎం నిర్ణయంపై పవన్ కీలక వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2024-07-28 06:54:03.0  )
ప్రభుత్వ పథకాల పేర్లలో మార్పులు.. సీఎం నిర్ణయంపై పవన్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: భావి తరాలకు స్ఫూర్తిని అందించే సమాజ సేవకులు, శాస్త్రవేత్తల పేర్లతో ప్రభుత్వ పథకాలను అమలు చేయడం హర్షణీయమని డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఏపీ విద్యాశాఖలో పథకాలను సర్వేపల్లి రాధకృష్ణన్, డొక్కా సీతమ్మ, అబ్దుల్ కలాం పేర్లతో అమలు చేయాలని తీసుకున్న నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌కు ఆయన అభినందనలు తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో అన్ని పథకాలకు ముఖ్యమంత్రి తన పేరు పెట్టుకున్నారని గుర్తు చేశారు. ఆ దుస్పంప్రదాయినిక మంగళంపాడి-విద్యార్థుల్లో స్ఫూర్తిని కలిగించే వారి పేర్లతో పథకాలు అమలు చేయడం మంచి పరిణామమని పవన్ పేర్కొన్నారు. పాఠశాల విద్యార్థులకు ఇచ్చే విద్యా కానుక ద్వారా యూనిఫాం, పుస్తకాలు, స్కూలు బ్యాగ్, బూట్లు, సాక్స్ లాంటివి ఇస్తున్నారని తెలిపారు. ఈ పథకాన్ని డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో అమలు చేయడం సముచితమన్నారు. ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చి, ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉప కులపతిగా, భారత తొలి ఉపరాష్ట్రపతిగా, 2వ రాష్ట్రపతిగా సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం రేపటి పౌరులకు మార్గ నిర్దేశనం చేస్తుందని పవన్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed