1వ తారీకు జీతం రాకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా నాకు తెలుసు: పవన్ కల్యాణ్

by Anjali |
Janasena Chief Pawan Kalyan Demands Bharat Ratna for Pingali Venkayya
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. నెల మొదటి తేదీన శాలరీ రాకపోతే ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయో.. ఆ బాధ ఆయనకు తెలుసునంటూ వెల్లడించారు. నెలఖరులో ఇంట్లో డబ్బులు లేక కటకలాడుతుంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక గవర్నమెంట్ జాబర్ కొడుకుగా తనకు తెలుసునని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. మంగళవారం ఉద్యోగ సంఘాల నాయకులతో డిప్యూటీ సీఎం పవన్ మాట్లాడారు. “గత ప్రభుత్వం మిమ్మల్ని భయపెట్టింది. కానీ మేము మీకు భుజం కాసే వ్యక్తులం. నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని, ఒకటి తారీకు కల్లా జీతం రాకపోతే ఎలా ఉంటుందో నాకు తెలుసు. నేను మీ కష్టాలని అర్ధం చేసుకోగలను. కొద్దిరోజుల్లో 7 శ్వేత పత్రాలు ప్రజల ముందు పెడతాం. ప్రజలకు ప్రభుత్వ పరిస్థితి తెలియాల్సి ఉంది. ఇప్పటికిప్పుడు చూస్తే రాష్ట్రానికి వేలకోట్లు రుణాలు తెచ్చారు. ఆ డబ్బంతా ఏం చేసారన్నది పరిశీలిస్తున్నాం” అంటూ పంచాయతీరాజ్ ఉద్యోగ సంఘాలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.

Next Story

Most Viewed