Pawan Kalyan:అసెంబ్లీలో అధికారులపై డిప్యూటీ సీఎం పవన్ ఫైర్..కారణం ఏంటంటే?

by Jakkula Mamatha |   ( Updated:2024-07-24 11:49:36.0  )
Pawan Kalyan:అసెంబ్లీలో అధికారులపై డిప్యూటీ సీఎం పవన్ ఫైర్..కారణం ఏంటంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రసంగిస్తూ గత వైసీపీ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో గత వైసీపీ పాలనలో జరిగిన పనులు, దోపిడీపై అనేక మంది సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారు. వాటిపై సమాచారం ఇవ్వాలని మంత్రులు అధికారులకు సూచించారు. అయితే అధికారులు ఇచ్చే వివరాలు చూసి కూటమి మంత్రులు అసంతృప్తికి గురవుతున్నారు. తాము అడిగింది ఒకటైతే అధికారులు చెబుతోంది మరోలా ఉంటుందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై కూటమి మంత్రులు, డిప్యూటీ సీఎం పవన్ తీవ్ర అసహనంతో ఉన్నారు. గ్రామ పంచాయతీల నిధుల మళ్లింపుపై అధికారులిచ్చిన సమాచారం పై పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సమగ్ర వివరాలు లేకుండా కేవలం ‘అవును కాదు’ అంటూ పొడిపొడి సమాధానాలు ఇస్తున్నారని మండిపడ్డారు. అనుబంధ పత్రాల్లో కాకుండా సభ్యులకిచ్చే సమాధానంలోనే వివరాలు ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల మళ్లింపుపై అధికారుల సమాచారం పై అధికార పక్షం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గత ప్రభుత్వం ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల విషయంలో అధికారులు సరైన వివరాలు ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ అసెంబ్లీ వేదికగా ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed