- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘త్యాగనిరతికి ప్రతీక బక్రీద్’..ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం!
దిశ,వెబ్‌డెస్క్: నేడు ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు భక్తి శ్రద్ధలతో బక్రీద్ పండుగను జరుపుకుంటారు. ముస్లింలు రంజాన్ తర్వాత అత్యంత ఇష్టంగా జరుపుకునే పండుగ బక్రీద్. దైవారాధన ప్రవక్త త్యాగనిరతిని గుర్తు చేసుకుంటూ అల్లాహ్ ప్రవక్తను, త్యాగాలకు ప్రతీకగా బక్రీద్‌ను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లింలకు మంత్రి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..ప్రతి పండుగలో గొప్ప ధార్మిక సందేశం, విశిష్టత నిబిడీకృతమై ఉంటుంది. ఇస్లాంపై విశ్వాసం ఉన్నవారు రంజాన్‌ను ఎంత భక్తి, శ్రద్ధలతో జరుపుకొంటారో బక్రీద్‌నూ అంతే నిష్టతో చేస్తారని చెప్పారు. ఈ పండుగ ముస్లిం అందరికీ భగవదనుగ్రహం కలుగచేయాలని ఆకాంక్షిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇప్పటికే ముస్లిం సోదరులకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
Read More : వామ్మో.. ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇలా తయారు అయ్యారేంట్రా బాబు.. వీడియో చూస్తే గూస్‌బమ్స్ పక్కా