- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గుడ్లవల్లేరు కాలేజీలో CERT విచారణ.. వెలుగులోకి కీలక విషయాలు
దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్ వాష్ రూమ్‌లో హిడెన్ కెమెరాలు ఉన్నాయని విద్యార్థులు ఆదోళనకు దిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలన కలిగించడంతో ప్రభుత్వం సీరియస్ అయింది. ఘటనలో నిజాలు వెలికి తీయాలని పోలీస్ శాఖను ఆదేశించింది. దీంతో పోలీస్ ఉన్నతాధికారులు గుడ్లవల్లేరు కాలేజీలో పర్యటించారు. కాలేజీ హాస్టల్ వాష్ రూములను పరిశీలించారు. హిడెన్ కెమెరాలు లేవని గుర్తించారు.
అయినా సరే ప్రభుత్వం మరింత లోతుగా విచారణ జరిపిస్తోంది. ఢిల్లీకి చెందిన CERT టెక్నికల్ సంస్థతో విచారణ చేయిస్తోంది. ఏలూరు రేంజ్ ఐజీ ఆధ్వర్యంలో ఈ టీమ్ గుడ్లవల్లేరు కాలేజీ హాస్టళ్లను క్షుణ్ణంగా పరిశీలించింది. ప్రభుత్వానికి మరో మూడు రోజుల్లో CERT టెక్నికల్ సంస్థ నివేదిక అందించనుంది. ఈ నేపథ్యంలో ఏలూరు ఐజీ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. గుడ్లవల్లేరు కాలేజీ హాస్టల్ వాష్ రూముల్లో ఎలాంటి హిడెన్ కెమెరాలు లేవని తెలిపారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థుల ఫోన్లు, ల్యాప్ టాపులను స్వాధీన చేసుకున్నామని తెలిపారు. వాష్ రూమ్‌లు, షవర్లో ఎలాంటి కెమెరాలు లేవన్నారు. ఏపీలో తొలిసారిగా కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సేవలు వినియోగించామని తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల అనుమానాలు నివృత్తి చేశామని ఏలూరు ఐజీ స్పష్టం చేశారు.