కుక్కల దాడిలో జింకపిల్ల మృతి

by GSrikanth |
కుక్కల దాడిలో జింకపిల్ల మృతి
X

దిశ, డైనమిక్ బ్యూరో: పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం గుచ్చిమి సోషల్ వెల్ఫేర్ పాఠశాల వద్ద జింకపిల్లపై కుక్కలు దాడికి పాల్పడ్డాయి. ఈ కుక్కల దాడిలో జింక పిల్ల తీవ్రగాయాలపాలైంది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు జింక పిల్లను ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. దీంతో ఫారెస్టు అధికారులు ఆస్పత్రికి తరలించి చికిత్సనందించారు. అయితే చికిత్సపొందుతూ జింకపిల్ల మృతి చెందింది. జింక పిల్లను పోస్టుమార్టం నిమిత్తం వైద్యుల వద్దకు ఫారెస్టు అధికారులు తరలించారు.

Advertisement

Next Story