మరింత బలహీనపడిన తుపాన్.. నేడు ఈ మూడు జిల్లాల్లో భారీ వర్షాలు

by Rani Yarlagadda |
మరింత బలహీనపడిన తుపాన్.. నేడు ఈ మూడు జిల్లాల్లో భారీ వర్షాలు
X

దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడి.. పుదుచ్చేరి సమీపంలో మొన్న సాయంత్రం తీరందాటిన ఫెయింజల్ తుపాను (Fengal Cyclone) క్రమంగా బలహీన పడుతోంది. పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తున్న వాయుగుండం (Depression) మరింత బలహీన పడిందని ఐఎండీ (IMD) వెల్లడించింది. దీని ప్రభావంతో అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, ఏలూరు, బాపట్ల జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

అనకాపల్లి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూల్, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడుతాయని తెలిపింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెండ్రోజులుగా ఎడతెరపి లేని వర్షం కురవడంతో 3800 హెక్టార్లలో వరిపంటకు నష్టం వాటిల్లింది. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. భారీ వర్షాల కారణంగా జలాశయాలకు వరద ఉద్ధృతి పెరిగింది. కాళంగి, ఆరణియార్, మల్లెమడుగు జలాశయాల గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed