CPIsecretary Ramakrishna : పురందేశ్వరి వ్యాఖ్యలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపాటు

by Y. Venkata Narasimha Reddy |
CPIsecretary Ramakrishna : పురందేశ్వరి వ్యాఖ్యలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపాటు
X

దిశ, వెబ్ డెస్క్ : అదానీకి బీజేపీకి(Adani to BJP)సంబంధం లేదంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి(Purandeswari) చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ(Ramakrishna) మండిపడ్డారు. ప్రధానీ మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి నుంచి వారి మధ్య సంబంధాలున్నాయన్నారు. పురంధేశ్వరి కాంగ్రెస్ లో కేంద్ర మంత్రిగా ఉన్నప్పటి నుంచే అదానీకి, బీజేపీకి సంబంధం ఉందన్నారు. 2014 పార్లమెంటు ఎన్నికల్లో అదానీ విమానంలో మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించారని, మోడీ ప్రధానీ అయ్యాక ఆయన వెంట అదానీ విదేశాల్లో పర్యటిస్తూ వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండన్ బర్గ్ నివేదిక వెల్లడైనప్పుడు కూడా మోడీ, అమిత్ షాలు అదానీని కాపాడారన్నారు.

సెకీ ద్వారా నాలుగు రాష్ట్రాల్లో సోలార్ పవర్ ప్లాంట్ల కోసం 2,400కోట్లు లంచాలు ఇచ్చారని స్పష్టంగా న్యూయార్కు కోర్టులో కేసు ఫైలయ్యాక కూడా కేంద్రం అదానీపై చర్యలు తీసుకోవడం లేదని, పార్లమెంటులో ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నా సమావేశాలను వాయిదా వేస్తున్నారే తప్పా అదానీపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. దేశమంతటా పోర్టులు, విమనాశ్రయాలు, వేల ఎకరాల భూములను మోడీ అదానీకి కట్టబెట్టడంలో మోడీ పాత్ర ఉందన్నారు. జగన్ అదానీల ఒప్పందంలోనూ మోడీ ప్రమేయం ఉందని, మోడీ జగన్ లు దేశ, రాష్ట్ర సంపదలను ఆదానీకి దోచి పెట్టారన్నారు. అదానీతో ఒప్పందాలన్ని రద్దు చేసి, వాటిపై సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Advertisement

Next Story