- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
YSRCP ని ఓడించాలంటే.. ఇష్టం లేకున్నా వాళ్లు కలవాల్సిందే: CPI Narayana కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో పొత్తులపై సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, వైసీపీని అరికట్టాలంటే అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఇష్టం ఉన్నా లేకున్నా.. టీడీపీ, జనసేన, వామపక్ష పార్టీలు కలిసి వెళ్లాలని.. అప్పుడే ప్రజలకు, రాష్ట్రానికి మేలు జరుగుతోందని సూచించారు. మోడీ, జగన్ ప్రభుత్వాలు ప్రజలను దోచుకుంటున్నాయని ఫైర్ అయ్యారు. ఏపీలో వైసీపీ, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. అయితే, సీపీఐ నారాయణ చేసిన వ్యాఖ్యలు ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. తమ వ్యతిరేక పార్టీతో పెట్టుకున్న జనసేనను.. వామపక్ష పార్టీలతో కలిసి రావాలని నారాయణ కోరడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైసీపీ వ్యతిరేక ఓటు చీలొద్దని పదే పదే చెబుతున్న పవన్ కల్యాణ్.. బీజేపీతో తెగదెంపులు చేసుకుని నారాయణ చెప్పినా విధంగా టీడీపీ, వామపక్షాలతో కలిసి వెళ్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
ఇవి కూడా చదవండి :