చంద్రబాబుకు హైకోర్టు కండీషన్లు: సాక్షులను ప్రభావితం చేయోద్దు.. ఎవరితోనూ చర్చించకూడదు

by Seetharam |   ( Updated:2023-10-31 06:03:05.0  )
చంద్రబాబుకు హైకోర్టు కండీషన్లు: సాక్షులను ప్రభావితం చేయోద్దు.. ఎవరితోనూ చర్చించకూడదు
X

దిశ, డైనమిక్ బ్యూరో : స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఊరట లభించింది. ఈ కేసులో నాలుగు వారాలపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. కేవలం చంద్రబాబు ఆరోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ మంజూరు చేసినట్లు న్యాయస్థానం తెలిపింది. ఈ నేపథ్యంలో నవంబర్ 28 వరకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. నవంబర్‌ 28న సరండర్‌ కావాలని ఆదేశించింది. ఇకపోతే నవంబర్ 10న మెయిన్ బెయిల్ పిటిషన్‌పై వాదనలు వింటామని ఏపీ హైకోర్టు వెల్లడించింది. ఇకపోతే ఆస్పత్రి మినహా మరే ఇతర కార్యక్రమాల్లో పాల్గొనకూడదు అని హైకోర్టు ఆదేశించింది. చంద్రబాబు నాయుడుకు అనుకూలమైన ఆస్పత్రులలో వైద్యం చేయించుకోవచ్చు అని తెలిపింది. అయితే ఆస్పత్రి, చంద్రబాబు నాయుడుకు జరిగిన చికిత్సకు సంబంధించి వివరాలను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌కు సీల్డ్ కవర్‌లో అందజేయాలని ఆదేశించింది. ఫోన్‌లో స్కిల్ స్కాంపై చర్చించకూడదంటూ షరతులు విధించింది. మీడియా, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు అని హైకోర్టు తెలిపింది. సాక్షులను ప్రభావితం చేసేలా వ్యవహరించ వద్దు అని స్పష్టం చేసింది. కేసుకు సంబంధించి ఎవరినీ ప్రభావితం చేసేలా.. ప్రలోభ పెట్టేలా వ్యవహరించవద్దు అని స్పష్టం చేసింది. అలాగే నవంబర్ 28న సాయంత్రం 5 గంటలకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌ వద్ద సరెరండర్ కావాలని స్పష్టం చేసింది. మరోవైపు అలాగే లక్షపూచీకత్తు, ఇద్దరు షూరిటీలు కోరింది. ఇకపోతే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు బిగ్ రిలీఫ్ దక్కింది. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడుకు బెయిల్ మంజూరు అయ్యింది. నాలుగు వారాలపాటు చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు వెల్లడించింది. చంద్రబాబు నాయుడు ఆరోగ్య సమస్యలను ఆయన తరఫు న్యాయవాదులు ప్రత్యేకంగా కోర్టులో ప్రస్తావించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం చంద్రబాబు ఆరోగ్య సమస్య లు దృష్టిలో పెట్టుకొని బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు చంద్రబాబు నాయుడుకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. నాలుగు వారాలు పాటు మధ్యంతర బెల్ మంజూరు చేసింది. తదుపరి విచారణను నవంబర్ 28కి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed