Viveka Murder Case: నిన్‌హెడ్రిన్ టెస్ట్‌కు వివేకా హత్య స్థలంలో దొరికిన లేఖ..

by srinivas |   ( Updated:2023-06-07 15:27:58.0  )
Viveka Murder Case: నిన్‌హెడ్రిన్ టెస్ట్‌కు వివేకా హత్య స్థలంలో దొరికిన లేఖ..
X

దిశ, వెబ్ డెస్క్: వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేకా హత్య సమయంలో లభ్యమైన లేఖను నిన్‌హెడ్రిన్ టెస్ట్‌కు కోర్టు అనుమతించింది. ఈ టెస్ట్‌తో లేఖపై ఉన్న వేలిముద్రలను గుర్తించనున్నారు. అయితే హత్యకు ముందు వివేకానందారెడ్డి ఈ లేఖను రాసినట్టుగా చెబుతున్నారు. ఈ లేఖపై ఎవరెవరి వేలిముద్రలు ఉన్నాయనేది నిన్ హెడ్రిన్ టెస్ట్ ద్వారా తెలుసుకునేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టులో అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారించిన ధర్మాసనం.. వివేకా లేఖను నిన్ హెడ్రిన్ టెస్ట్‌కు అనుమతిస్తూ ఆదేశాలిచ్చింది.

ఇక వివేకా హత్య జరిగిన స్థలంలో ఈ లేఖ లభించింది. 2021 ఫిబ్రవరి 11న ఈ లేఖను అధికారులు ఫోరెన్సిక్‌కు పంపారు. అయితే ఈ లేఖను ఒత్తిడిలో రాసినట్టు సీఎఫ్ఎస్ఎల్ నివేదికలు తేల్చాయి. దీంతో లేఖపై ఉన్న వేలి ముద్రలు గుర్తించాలని సీబీఐ నిర్ణయించింది. ఇందుకోసం లేఖపై నిన్ హెడ్రిన్ టెస్ట్ నిర్వహించాలని సీఎఫ్ఎస్ఎల్‌ను కోరింది. వివేకా హత్య కేసులో ఈ లేఖ కీలక సాక్ష్యంగా ఉంది. కాబట్టి నిన్ హెడ్రిన్ టెస్ట్ నిర్వహిస్తే లేఖలో రాసిన చేతిరాత దెబ్బతినే అవకాశం ఉందని, కేసు దర్యాప్తు, విచారణకు విఘాతం కలుగుతుందని సీబీఐ అధికారులు భావించారు. ఈ మేరకు కోర్టును ఆశ్రయించారు. ఒరిజినల్ లేఖకు బందులు కల్ జిరాక్స్‌ను రికార్డుల్లో భద్రపరిచారు. ఈ లేఖను సాక్ష్యంగా పరిగణించేందుకు అనుమతించాలని సీబీఐ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు వివేకాతో బలవంతంగా లేఖను రాయించారని అప్రూవర్ దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారని సీబీఐ కోర్టుకు తెలిపింది.ః

Advertisement

Next Story