'మసిపూసి మారేడుకాయ' చేసిన రాష్ట్ర ప్రభుత్వం

by sudharani |   ( Updated:2023-02-07 05:58:41.0  )
మసిపూసి మారేడుకాయ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ రుషికొండలో గతంలో తవ్వకాలు జరిపిన విషయం తెలిసిందే. రుషికొండపై గ్రీన్ మ్యాట్‌ కప్పడంతో సోషల్ మీడియాలో రాష్ట్ర ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు తలెత్తుతున్నాయి. గతంలో కొండను చూసినప్పుడు దాన్ని తవ్విన చోట ఎర్రగా మట్టి కనిపించేది. అయితే ప్రస్తుతం గ్రీన్ మ్యాట్ కప్పడంతో కొండంతా పచ్చగా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నాయి.

కాగా.. మార్చి నెలలో విశాఖ వేదికగా జీ20 గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. దీనిలో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుంచి ప్రతినిధులు వస్తారు. ఈ కారణం చేతనే వారికి రుషికొండ పచ్చగా కనిపించేందుకు గ్రీన్ మ్యాట్ కప్పి.. రుషికొండను మసిపూసిన మారేడుకాయల చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా.. ఈ వివాదంపై అధికారులు స్పందించకపోవడం గమనార్హం.

Advertisement

Next Story